Opinions of Writers and Activists Who supports Mahesh katti in Social Meadia
సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీవీ చర్చా కార్యక్రమాలు, పలు ఇంటర్వ్యూలు వీరి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది. దాదాపు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెలుగు జనాలందరికీ ఒక్కటే హాట్ టాపిక్ "కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్" ఎక్కడ చూసినా ఇదే రచ్చ. "పవన్ కళ్యాణ్‌ను ఆయన అభిమానులు దేవుడగా భావిస్తారు, ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే వారు ప్రతిఘటిస్తారు.... ఈ విషయం నేను అర్థం చేసుకోగలను, అయితే వారు తనను హెచ్చరిస్తున్న తీరులో హింసాత్మకధోరణి కనపడుతోందని, కొడతాం, చంపుతాం అంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నార"ని కత్తి మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు.