Random Video

PV Sindhu Mistreated By IndiGo Ground Staff

2017-11-04 1,506 Dailymotion

Sindhu claimed that a member of Indigo's ground staff spoke very rudely with her while she was about to board the flight.
రియో ఒలింపిక్ పతక విజేత, హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధు శనివారం ముంబైకి బయల్దేరింది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్‌లోని అజితేష్ అనే వ్యక్తి నుంచి తాను అవమానింపబడ్డానని సింధు చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి.ఈ విషయమై సింధు మొత్తం మూడు ట్వీట్లు చేసింది. అందులో అసలేం జరిగిందో చెప్పకుండా అజితేష్‌తో మాట్లాడితే ఏం జరిగిందో అతడే చెబుతాడంటూ ట్విట్టర్‌లో పేర్కొంది. సింధు శనివారం 6ఈ 608 విమానంలో ముంబైకు వెళ్తుండగా విమాన సిబ్బందిలోని అజితేశ్‌ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడు.
గ్రౌండ్‌ స్టాఫ్‌ మిస్టర్‌ అజితేశ్‌ నాతో చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో సరిగ్గా మసులుకోమని ఎయిర్‌ హోస్టెస్‌ అషిమా అతడికి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఆమెతో కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో నేను ఆశ్చర్యపోయా. ఇలాంటి వ్యక్తి సిబ్బందిగా ఉంటే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఖ్యాతి దెబ్బతింటుంది' అని ఆమె పేర్కొంది.