Random Video

Chandrabau naidu On cabinet ministers : నారా లోకేశ్‌ ముందంజలో, చంద్రబాబు వ్యంగ్యం

2017-11-24 4 Dailymotion

Funny conversation between Andhra pradesh chief minister Chandrabau naidu his cabinet ministers. He conducted video conference on files clearance.

ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన సహచర మంత్రులపై జోకులు పేల్చారు.వీడియో కాన్పరెన్స‌లో చంద్రబాబునాయుడు మంత్రులకు నవ్వుతూనే చురకలంటించారు. తన వద్దే ఫైళ్ళు పేరుకుపోవడంపై అధికారులపై ఒకింత ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిత్యం పార్టీ కార్యక్రమాలతో పాటు, అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతుంటారు. అయితే అంతేకాదు పార్టీ సమావేశాల్లో కానీ, అధికారులతో సమీక్ష సమావేశాల్లో కానీ, చంద్రబాబునాయుడు నవ్వుతూ మాట్లాడడం చాలా అరుదుగా కన్పిస్తోంది.
అయితే ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడు తన పంథాను మార్చుకొన్నారు. విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని వచ్చిన చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో జోకులు వేసి నవ్వించారు. అదే తరహలో మరోసారి వ్యవహరించారు
గత వారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైళ్ళ క్లియరెన్స్‌ గురించి సమీక్షించారు. ఫైళ్ళ క్లియరెన్స్‌లో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి నారా లోకేశ్‌ ముందంజలో ఉన్నారు. వీరి వద్దకు వచ్చిన ఫైళ్ళు వచ్చినట్టు పంపుతున్నట్టున్నారు. అందుకే ముందంజలో ఉన్నారంటూ జోకు వేశారు. తాము ఫైళ్ళను పరిశీలించి పరిష్కరించి పంపుతున్నామని ఎక్కడా జాప్యం చేయడంలేదన్నారు ఆ మంత్రులు