Random Video

Reason for Revanth Reddy's silent రేవంత్ ప్లాన్ అదా ?

2017-11-24 292 Dailymotion

What is the reason for revanth reddy silent in congress. Revanth reddy planning for future in Congress party, So Revanth Reddy waiting for some days said political analysts said

టిడిపిలో ఉన్నంతకాలం దూకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగానే కొంత స్పీడ్‌ను తగ్గించినట్టుగా కన్పిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి తన స్పీడ్‌ను తగ్గించుకోవడానికి వ్యూహమే కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కుదురుకున్న తర్వాత రేవంత్ రెడ్డి తన స్పీడ్‌ను కొనసాగించే అవకాశం ఉందంటున్నారు ఆయన సన్నిహితులు.
రేవంత్ రెడ్డి మరో 16 మంది ముఖ్యమైన అనుచరులతో కలిసి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో గత నెల 31వ, తేదిన చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత టిడిపిలో ఉన్న సమయంలో వ్యవహరించిన దూకుడును ప్రదర్శించడం లేదు.
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లను రేవంత్ రెడ్డి కలుసుకొంటున్నారు. అందరితో కలిసిపోయే ప్రయత్నిస్తున్న సంకేతాలను రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో కూడ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది.
రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా పేరుపడిన కొప్పుల రాజుతో రేవంత్ రెడ్డి రాయబారం నడిపించారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో తన చేరికపై పార్టీ నేతలు వ్యతిరేకతను వ్యక్తం చేయకూడదనే అభిప్రాయంతో రేవంత్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.