Random Video

Pawan Kalyan Visits Polavaram Project and Gets Doubt On Chandrababu

2017-12-07 2,516 Dailymotion

Pawan Kalyan Visits Polavaram Project and Reviews Polavaram Project Works.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉదయం తొమ్మిది గంటలకు రాజమహేంద్రవరం రివర్ బే హోటల్ నుంచి బయలుదేరి పోలవరం చేరుకున్నారు. పవన్‌ను చూసేందుకు రివర్ బే హోటల్‌కు, పోలవరం ప్రాజెక్టు వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చారు.పోలవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడి అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. మ్యాప్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులను పరిశీలించి, పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఇంజినీర్లు ఆయనకు అన్నింటిని వివరించారు.
ఆయన హిల్ వే నుంచి ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణ పనులు సాగుతున్న తీరును ఎస్‌ఈ వి.రమేష్ బాబు వివరించారు. స్పిల్‌వే, డయా ఫ్రంవాల్‌ నిర్మాణం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, నిర్మాణాల్లో ప్రగతిని ఇంజినీర్లు వివరించారు. పవన్‌ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.పోలవరం ప్రాజెక్టు పద్ద పవన్ కళ్యాణ్‌ను చూడగానే అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం... సీఎం అంటూ గట్టిగా నినదించారు. దీంతో పవన్ అసంతృప్తికి లోనయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఇక్కడకు ఓ పని మీద వచ్చానని అభిమానులకు చెప్పారు. అలాంటి నినాదాలు చేయడం సరికాదని వారించారు. అయినా అభిమానులు నినాదాలు చేశారు.