Random Video

Himachal Pradesh Election Results : హిమాచల్‌ప్రదేశ్ లో బీజేపీ హవా..!

2017-12-18 1,262 Dailymotion

The fate of 337 candidates including Chief Minister Virbhadra Singh and his predecessor Prem Kumar Dhumal will be known today as counting of votes will take place in Himachal Pradesh where traditional rivals BJP and Congress have contested all 68 seats.

దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బీజేపీ కంచుకోట గుజరాత్ తోపాటు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం 8గంటల నుంచి వెలువడుతునున్నాయి. ఇప్పటికే ఓపినియన్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకే పట్టం కట్టినప్పటికీ ఫలితాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. తొలి నుంచి కూడా బీజేపీ ఆధిక్యతను కనబరుస్తోంది.
గుజరాత్, హిమాచ్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఊహించిందేనని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కాగా, పార్లమెంటుకు వచ్చిన ప్రధాని మోడీ విక్టరీ సింబల్ చూపుతూ లోనికి వెళ్లారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తున్నప్పటికీ ఆ పార్టీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ వెనుకంజలో ఉండటం గమనార్హం.
కాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం కుమారుడు విక్రమాదిత్య ముందంజలో ఉన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 42 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 68అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 35 సీట్లు వచ్చిన పార్టీ అధికారం చేపట్టనుంది.
కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున అధికారాన్ని దక్కించుకుంటూ వస్తున్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఈసారి మాత్రం బీజేపీవిజయమని అంచనాలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం గెలుపై తన ధీమాను వ్యక్తం చేస్తోంది.