Random Video

Christmas 2017 celebrations : క్రిస్మస్.. సంబరాలు, వీడియో !

2017-12-24 1 Dailymotion

Christmas celebrations around the world. The name 'Christmas' comes from the Mass of Christ Jesus.

డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి.
క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరిసంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలూ గుర్తించాయి. ఆ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైంది. పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు.
క్రిస్మస్‌ వేడుకలను వివిధ దేశాల్లో వివిధ రకాలుగా చేస్తారు. అమెరికాలో అయితే క్రిస్మస్‌ ట్రీ అలంకరణకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఇళ్లన్నీ దీపాల వెలుగులతో మెరిసిపోతుంటాయి.