Random Video

Mahadayi water dispute : మహదాయి నీటి వివాదం: రైతుల ఆందోళన

2017-12-27 128 Dailymotion

Farmer groups in north Karnataka have called for a bandh today demanding the implementation of the Kalasa-Banduri project.


వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహదాయి నది నీళ్ల పంపిణీ కర్ణాటక భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే గోవా-కర్ణాటకల మధ్య ఉన్న మహదాయి నీటి వివాదాన్ని పరిష్కరిస్తామని కర్ణాటక బీజేపీ ప్రకటించింది. గత వారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో గోవా సీఎం మనోహర్ పారికర్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పలతో న్యూఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కర్ణాటక ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోవా.. మహదాయి నుంచి 7టీఎంసీల నీటిని ఇచ్చేందుకు అంగీకరించిందని యడ్యూరప్ప తెలిపారు. అంతేగాక, గోవా నుంచి నీటిని రాబట్టేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

కాగా, మంగళవారం భారీ ఎత్తున రైతులు ఆందోళనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తమకిచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ఉత్తర కర్ణాటక రైతులు డిమాండ్ చేశారు. రైతులతో యడ్యూరప్ప మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని హామిచ్చారు. కాగా, ముంబై-కర్ణాటక ప్రాంతం 56అసెంబ్లీ స్థానాలు కలిగివుంది. ఇక్కడ మెజార్టీ ప్రజలు లింగాయత్‌లే కావడం బీజేపీకి కంచుకోటగా మారనుంది. ఏదైనా తేడే చేస్తే మాత్రం లింగాయత్‌ల నుంచి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కాగా, బీజేపీ ఇచ్చిన హామి నిలబెట్టుకోవాలంటూ ఉత్తర కర్ణాటక రైతులు బుధవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు.