Random Video

మెగా హీరో Vs మెగా ఫ్యాన్.. 2017 ఫైనల్ క్లాష్‌ ఇదే..!

2017-12-27 1,338 Dailymotion

Two movies, one from mega hero and another from hard core mega fan coming on 28th and 29th December will call it a wrap for the old year.


ఇద్దరు పేరున్న హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే.. కచ్చితంగా రెండింటిలో దేనిది పైచేయి అన్న చర్చ కామన్. అఫ్‌కోర్స్.. ఇప్పుడు చెప్పుకోబోయే ఇద్దరు.. హీరోగా పేరు తెచ్చుకోవడానికి ఇంకా కష్టపడుతున్నవారే. అందులోనూ ఒకరు మెగా కాంపౌండ్ హీరో అయితే.. మరొకరు మెగా ఫ్యాన్ కావడం విశేషం. 2017 ఫైనల్ క్లాష్ ఇప్పుడు వీరిద్దరి మధ్యే కావడం మరో విశేషం..
డిసెంబర్ 28న అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రమోషన్, బజ్ రీత్యా ఈ సినిమాపై బాగానే ఎటెన్షన్ క్రియేట్ అయింది. హీరోగా నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్న అల్లు శిరీష్.. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనుకుంటున్నాడు. 2017కి విజయంతో ఎండ్ కార్డ్ వేయాలని భావిస్తున్నాడు.
మెగా అభిమాని అయిన సునీల్..ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోతోనే పోటీ పడాల్సి రావడం అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సినిమాల పరంగా చాలాకాలంగా హిట్ లేక సతమవుతున్నాడు సునీల్. ఈసారి శంకర్ దర్శకత్వంలో డిసెంబర్ 29న '2కంట్రీస్'తో రాబోతున్నాడు. కథలో కామెడీ ప్రధానంగా ఉండటం.. గతంలో కామెడీ ఇరగదీసిన నేపథ్యం సునీల్ కు ఉండటంతో.. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.