Random Video

ఇద్దరిపై రేప్.. ఓలా క్యాబ్ డ్రైవర్ నిర్వాకం..!

2018-01-15 1,527 Dailymotion

Ola cab driver Kiran arrested in Hyderabad.

ఓలా క్యాబ్ డ్రైవర్ ముసుగులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లోని కుషాయిగుడా పోలీసులు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
శనివారంనాడు ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు కందుకూరి నాగమణి కిరణ్ ఇప్పటి వరకు పది మంది యువతులను వేధించాడు.
ఇద్దరిపై అత్యాచారం చేశాడు. పదేళ్ల బాలికపై కూడా వేధింపులకు పాల్పడ్డాడు. డోర్ లాక్ చేసి అతుడు అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు. అయితే బాధితుల్లో ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శనివారంనాడు అతను ఓ యువతిపై అత్యాచార యత్నం చేశాడు గట్టిగా అరిచి, అతడి నుంచి తప్పించుకుని బాధితాురాలు పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
హర్యానాలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులు శనివారంనాడు 22 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై కదులుతున్న కారులో రెండు గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన హర్యానాలోని ఫరిదాబాదులో జరిగింది. అత్యాచారం చేసిన తర్వా ఆమెను సిక్రి గ్రామంలోని పెట్రోల్ పంపు వద్ద పడేసి పారిపోయారు. ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు.
ఆ సంఘటన సాయంత్రం 7 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో (ఎస్‌యువి)లోకి బలవంతంగా లాక్కున్నారని, ఆ తర్వాత వాహనంలో ఆమెపై అత్యాచారం చేశారని అన్నారు.దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.