Random Video

DK ARUNA VS KTR Counters, Must Watch

2018-01-25 1 Dailymotion

DK ARUNA VS KTR Counters in assembly, Must Watch

తెలంగాణ శాసనసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రధాన ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే అరుణ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంది. ఒకనొకదశలో మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. పెన్షన్ విషయంలో చోటుచేసుకున్న వివాదం ముదిరింది. . మంత్రి కేటీఆర్‌ కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నార‌ని డీకే అరుణ విమ‌ర్శించారు. అలానే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు లేద‌ని, అస‌లు కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో అని అరుణ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కేటీఆర్, డీకే అరుణ వివాదం విషయంలో సభలో మాట్లాడిన వీడియో పుటేజీలు చూసిన తర్వాత, అందరి అభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవాలని అందరూ సూచించారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. తాను తెలంగాణలో పుట్టి, పెరిగానని చెప్పారు. అందువల్ల తనకు ఆంధ్రా వాసనలు వచ్చే అవకాశం లేదన్నారు. కానీ, కేటీఆర్ ఆంధ్రాలో విద్యాభ్యాసం పూర్తి చేయడమే కాకుండా, ఇప్పటికీ ఆంధ్రా నేతలతో కలిసి వ్యాపారం చేస్తున్నారన్నారు. కానీ కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఆంధ్రోళ్లను తిట్టనిదే నిద్రపట్టదని ఆమె విమర్శించారు.