Random Video

Union Budget 2018 : బడ్జెట్ సూపర్, బాబుకు కౌంటర్

2018-02-02 964 Dailymotion

Andhra Pradesh BJP minister Manikyala Rao counter to AP CM Chandrababu Naidu on Union Budget 2018.

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి నిధులు ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన లేదన్న టీడీపీ నేతలకు ఏపీ మంత్రి మాణిక్యాల రావు శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లాగే ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఏపీని అవసరమైన సందర్భాల్లో ప్రత్యేకంగా చూస్తున్నామని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. డీపీఆర్ లేనందునే రాజధాని అమరావతికి నిధులు రాలేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అని టీడీపీ నేతలు కొందరు చెప్పడం విడ్డూరమన్నారు. ఏపీకి అన్యాయం అనేది మిత్రపక్షంలోని కొందరి వాదన అన్నారు.
బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని మిత్రపక్షం అనడం లేదని, మిత్రపక్షంలోని కొందరు నేతలు అంటున్నారని మాణిక్యాల రావు అభిప్రాయపడ్డారు. వాళ్లు బడ్జెట్ రికార్డ్స్ చూడలేదని, అందుకే అలా అంటున్నారని చెప్పారు. పోలవరంకు సహకరిస్తామని నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారని తెలిపారు. నిధులు ఆలస్యం కావన్నారు. రెండేళ్లలో పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నదే తాము అన్నారు.
బడ్జెట్ పైన పూర్తి స్పష్టత రావాల్సి ఉందని మాణిక్యాల రావు చెప్పారు. ఏపీని ప్రత్యేకంగా చూడటం లేదన్న టిడిపి నేతల విమర్శలపై స్పందిస్తూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీ ఉందని చెప్పారు. అందుకే రైతులను ఆదుకునే బడ్జెట్, 50 లక్షల కుటుంబాలకు హెల్త్ స్కీం ఉందని, అందులో ఏపీ కూడా ఉందని చెప్పారు.