Random Video

Telugu Actors Demands Special Status For Andhra Pradesh

2018-02-06 222 Dailymotion

Even as politicians, industrialists and activists are demanding a special status for Andhra Pradesh, actor Nikhil Siddharth has also joined the chorus and has urged the government to release funds for the truncated state.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ సినీ ప్రముఖులు కూడా గళం విప్పుతున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే అమలు చేయడం లేదని టీడీపీ, వైసీపీ సహా అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించిన టీడీపీ, తాజాగా బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగకపోవడంతో తాము తిరిగి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తామని చెబుతున్నారు. వైసీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తోన్నారు. పార్టీలకు మద్దతుగా సినీ ప్రముఖులు వస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ నటుడు నిఖిల్ ట్వీట్ చేశారు. ఏపీలో పలు ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్న సందర్భంలో అక్కడి ప్రజల ఆకాంక్షను తాను తెలుసుకున్నానని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని నిఖిల్ ట్వీట్ చేశారు. నిఖిల్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
దీనిపై నిఖిల్ మరోసారి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ తనకు ట్వీట్ చేస్తున్న వారందరికీ ఓ విజ్ఞప్తి అని, ఎవరూ హింసాత్మక నిరసనలను ప్రోత్సహించవద్దని, ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. మన చేతిలో బలమైన ఆయుధం ఉందని, 2019 ఇంకెంతో దూరం లేదన్నారు. అధికారంలో ఉన్నవారు ఈ విషయం గుర్తించాలన్నారు. ఈ ట్వీట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా మోడీని ఉద్దేశించి చేసిందని చెప్పవచ్చు. అలాగే చంద్రబాబుకు ఇది హెచ్చరిక ట్వీట్ అని కూడా చెప్పవచ్చు. హోదా ఇవ్వని బీజేపీతో కలిస్తే ఓటుతో బుద్ధి చెప్పాల్సిందేననే అభిప్రాయం కనిపిస్తోంది.
నటుడు నిఖిల్ మరో ట్వీట్‌లో 'నేను కేవలం ఓ నటుడినే. కానీ ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే నీకు ఇవన్నీ ఎందుకు అని కొందరు అడుగుతున్నారు. కానీ షూటింగ్ సమయంలో ప్రజల ఆకాంక్ష తెలుసుకున్నానని, ఏపీకి కేంద్రం నుంచి చాలా నిధులు రావాలని, ఓ భారతీయుడిగా, ఓ తెలుగు వ్యక్తిగా స్పందిస్తున్నా' అని పేర్కొన్నారు.