Random Video

Kajal Aggarwal became 'Aunt'

2018-02-22 1 Dailymotion

Kajal Aggarwal Became aunt Because Nisha Agarwal delivered a Baby Boy..

మూడు పదుల వయసులో కూడా చెదరని అందంతో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ చంద్రబింబం లాంటి అందాలకి ఫిదా కాని వారంటూ ఉండరు. సౌత్ లో కాజల్ అగర్వాల్ గత దశాబ్దం నుంచి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాంటి కాజల్ ఆంటీ అయిపోయింది. అదేమిటి అని అనుకుంటున్నారా.. కాజల్ ఆంటీ అయిపోయింది వయసు పరంగా కాదు. కాజల్ సోదరి కొంతకాలం తెలుగులో హీరోయిన్ గా మెరిసిన నిషా అగర్వాల్ ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ రకంగా కాజల్ అగర్వాల్ ఆంటీ అయింది.
కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత నిషా అగర్వాల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏమైంది ఈ వేళ చిత్రం ద్వారా నిషా తెలుగు వెండి తెరకు పరిచయం అయింది.
ఆ చిత్రంలో నిషా లుక్స్ ఆకట్టుకున్నాయి.
ఆ తరువాత నారా రోహిత్ సోలో చిత్రంలో నటించి మెప్పించింది.
నిషాకు కొన్ని అవకాశాలు వచ్చినా ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో క్రమంగా నిషా అగర్వాల్ కు ఛాన్సులు కరువయ్యాయి.
నిషా 2013 లో ముంబై కి చెందిన కరణ్ వలేచ అనే బిజినెస్ మాన్ ని వివాహం చేసుకుని రియల్ లైఫ్ లో సెటిల్ అయింది.
నిషా ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడికి ఇషాన్ వలేచ అని పేరు కూడా పెట్టేశారు. తన సోదరి కొడుకు ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్ సంతోషంలో మునిగి తేలుతోంది.