Random Video

Central Trap Around KCR KCR చుట్టూ కేంద్రం వల...

2018-03-08 1 Dailymotion

Central Intelligence groups kept a hawk’s eye on Telangana CM KCR political steps after announcing third front
కేంద్రానికి ఎదురు తిరిగితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందోనన్న భయం.. దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీ నేతలను వెంటాడుతోంది. కేంద్రం నుంచి న్యాయంగా దక్కాల్సిన వాటి గురించి అడగాలన్నా.. ఆ జంకుతో కొంతమంది వెనుకడుగేస్తున్న పరిస్థితి.

థర్డ్ ఫ్రంట్ రూపంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటిని కేసీఆర్ ఒక్కటి చేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఆయనపై నిఘా పెట్టేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ కారణంగానే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు చెబుతున్నారు.

ఇప్పటినుంచి పార్టీ శ్రేణులు ఎవరైనా సరే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ గులాబీ క్యాడర్‌కు సూచించినట్టు తెలుస్తోంది. కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయ్యే అవకాశం ఉండటంతో.. వివాదాస్పద లేదా కీలక విషయాలేమైనా ఉంటే ఫోన్ కాల్స్ ద్వారా చర్చించవద్దని ఆయన సూచించినట్టు చెబుతున్నారు.