Random Video

పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ ఆకస్మిక మృతి

2018-05-07 61 Dailymotion

A day after wedding of Paritala Ravi's daughter Snehalatha, Ravi's close aide and right-hand man Chaman Saab breathed his last. Chaman suffered a severe cardiac arrest on Monday and was rushed to a private hospital in Anantapur where he had deceased while undergoing treatment.


తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి ముఖ్య అనుచరుడైన చమన్(58) గుండెపోటుతో మృతి చెందారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక పర్యవేక్షణ కోసం వచ్చిన ఆయన మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్నారు.
కాగా, చమన్‌కు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్ మృతి చెందారు.
పరిటాల రవికి ఎంతో సన్నిహితుడైన చమన్‌ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో చమన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు.
2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం... పరిటాల సునీత మంత్రి అవడంతో.. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత తన పదవికీ రాజీనామా చేశారు.
కాగా, కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సునీత చమన్.. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగానే చమన్ ఆకస్మికంగా మృతి చెందారు. చమన్ మృతి చెందారనే విషయం తెలియగానే అక్కడే ఉన్న సునీత ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరుయ్యారు.