Random Video

Bharath Ane Nenu Is In A Small Controversy

2018-05-10 1 Dailymotion

Controversy on Mahesh Babu Bharat Ane Nenu movie. They used our party name says Dasari Ramu
#BharatAneNenu
#DasariRamu
#MaheshBabu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మంచి విజయం సాధించింది. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. స్టైలిష్ సీఎంగా వివాదంలో భరత్ అనే నేను.. నోటీసులు పంపిస్తాం
మహేష్ నటన ఆకట్టుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్నపటికీ ఈ చిత్రంలో దర్శకుడు కొరటాల కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూడుకున్నాడు. ఇప్పటికీ భరత్ అనే నేను చిత్రం మంచి వసూళ్లతో రన్ అవుతోంది. రాజకీయ పరమైన కథతో ఎలాంటి వివాద భరిత అంశాలకు తావు లేకుండా కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రాఫిక్ సమస్య, ప్రభుత్వ విద్యావిధానం, లోకల్ గవర్నెన్స్ వంటి అంశాలని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. వివాదాలకు చోటు లేకుండా దర్శకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భరత్ అనే నేను చిత్రం చిన్నపాటి వివాదంలో చిక్కుకుంది.
భరత్ అనే నేను చిత్రంలో ఉపయోగించిన నవోదయం పార్టీ తమదే అని ఆ పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపిస్తున్నారు. ఇందులో ఉపయోగించిన గుర్తు కూడా తమదే అని దాసరి రాము అంటున్నారు.
తమ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు కూడా ఉందని, అలాంటి పార్టీని చిత్రాల్లో ఎలా వాడుకుంటారని దాసరి రాము అంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాత, దర్శకుడికి నోటీసులు పంపబోతున్నట్లు ఆయన తెలిపారు.
భరత్ అనే నేను చిత్రం విషయంలో ఎలాంటి వివాదాలకు జరగకుండా తాను చాలా అలోచించి కథ రూపొందించామని కొరటాల చిత్ర ప్రమోషన్ లో చెప్పారు. ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ, నాయకుడిని కానీ టార్గెట్ చేసే విధంగా ఈ చిత్రంలో డైలాగులు,సన్నివేశాలు లేవు. కేవలం ప్రజలు ఆలోచించేలా మాత్రమే చిత్రాన్ని రూపొందించినట్లు కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే.