Random Video

Karnataka Assembly Elections 2018: MLA Rajanna Collapsed Near Polling Booth

2018-05-12 305 Dailymotion

Chikkaballapur district Shidlaghatta constituency Independent candidate Rajanna suddenly ill. his followers rushed him to the hospital He is now admitted to ICU. He was JDS ticket aspirant but high command did not give ticket to him.
#KarnatakaAssemblyElections2018
#Rajanna
#Kumaraswamy
#Indepedent

చివరి నిమిషంలో అధిష్టానం రివర్స్ గేర్ వెయ్యడంతో ఆందోళనలో ఉన్న కర్ణాటక ఎమ్మెల్యే గుండెపోటుతో పోలింగ్ కేంద్రం సమీపంలో కుప్పకూలిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని శిడ్లఘట్టలో జరిగింది. పరిస్థితి విషమంగా ఉండంటంతో శిడ్లఘట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజక వర్గం స్వంతత్ర పార్టీ అభ్యర్థి రాజన్నకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మాజీ సీఎం మోసం చేశారని ఆవేదనతో రాజన్నకు గుండెపోటు వచ్చిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
శనివారం శిడ్లఘట్ట నియోజక వర్గంలో జోరుగా పోలింగ్ జరుగుతోంది. శిడ్లఘట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్నారు. ఆ సందర్బంలో గుండెపోటుతో రాజన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను శిడ్లఘట్టలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాజన్న జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో రాజన్నకు జేడీఎస్ పార్టీ బీఫారం ఇచ్చింది. రాజన్నకు ఇచ్చిన బీఫారం చివరి నిమిషంలో రద్దు చేసిన జేడీఎస్ చివరికి బీఎన్. రవికుమార్ కు టిక్కెట్ ఇచ్చింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి హామీతో రాజన్న స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రచారం చేశారు. అయితే పోలింగ్ కు ఒక్క రోజు ముందు (శుక్రవారం) హెచ్.డి.కుమారస్వామి జేడీఎస్ కార్యకర్తలు అందరూ రవికుమార్ కు మద్దతు ఇవ్వాలని వీడియో సందేశం పంపించారు.