Random Video

Andhra Pradesh Gets Separate State Symbols

2018-05-31 637 Dailymotion

Amaravathi:Neem and black buck have been declared as the state tree and animal respectively of Andhra Pradesh.Rose-ringed parakeet will be the state bird while jasmine will be the state's flower, Principal Secretary of Environment and Forests G Anantha Ramu said in an order today.

రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో ఈ మేరకు వాటిని ఖరారు చేస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే కొనసాగించారు. అయితే విభజన అనంతరం రాష్ట్ర భౌగోళిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని నూతన రాష్ట్ర చిహ్నాలను ప్రకటించింది ఎపి ప్రభుత్వం.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, ప్రస్తుతం దాని స్థానంలో రామచిలుకను నిర్ణయించారు. అలాగే రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేపింది. అయితే, ప్రభుత్వం తాజా ప్రకటించిన ఈ చిహ్నాలు జూన్ 6 వ తేదీ నుంచి మాత్రమే అధికారికంగా అమల్లోకి రానుండటం గమనార్హం.