Random Video

Actress Apoorva Makes Serious Comments On Pawan Kalyan

2018-06-01 56 Dailymotion

Actress apoorva about Pawan Kalyan And Heroine Bhumika Chawla. She opens up about in Tollywood
#PawanKalyan
#BhumikaChawla
#Tollywood

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం చెలరేగిన సమయంలో నటి అపూర్వ కూడా ఈ పోరాటంలో పాలు పంచుకుంది. శ్రీరెడ్డికి మద్దత్తుగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ పోరాటం అనేక మలుపులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం మొదలు పెట్టిన సమయలో ఆమెకు అద్భుతమైన మద్దత్తు లభించింది. కొందరు నటీనటులు, ప్రజా సంఘాలు శ్రీరెడ్డికి అండగా నిలిచాయి. తాజగా జరిగిన ఇంటర్వ్యూ లో నటి అపూర్వ పలు ఆసక్తికర విషయాలని టాలీవుడ్ గురించి వివరించారు.
శ్రీరెడ్డి ఆవేశంలో పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిందని నటి అపూర్వ అన్నారు. కాని అది చాలా పెద్ద తప్పు. అలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం సహనం కోల్పోలేదు. ఆయనకు సహనం ఎక్కువ. శ్రీరెడ్డిని ఏమీ అనలేదని అపూర్వ అన్నారు.
ఇండస్ట్రీలోకి ఏ అమ్మాయి అయినా బ్యాగ్రౌండ్ లేకుండా వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని అపూర్వ అన్నారు. కొత్తగా వచ్చిన అమ్మాలని పడుకోవడానికి కమిట్మెంట్ అడుగుతారని తెలిపింది.
తన కెరీర్ ఆరంభంలో కూడా కమిట్మెంట్ అడిగారని అపూర్వ అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ సినిమా మొత్తం వేధిస్తూనే ఉన్నారు. సినిమాలో ఏ ఆర్టిస్టు కోపరేట్ చేయలేదు అని అపూర్వ తెలిపింది. డైరెక్టర్ తిడుతూనే ఉన్నారు.