Random Video

MS Dhoni Joins In Guinness Book Of World Records

2018-06-07 194 Dailymotion

The game of cricket has also been able to etch a position on this coveted list, with many players being conferred with this honour because of their skills and never-say-die attitude.

మైదానంలో దిగిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి భిన్నంగా ఆడి చూపించి రికార్డులకెక్కాలనుకుంటారు. మామూలు రికార్డులు వేరు.. అత్యంత అరుదుగా దక్కే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఘనత సాధించాలంటే పెట్టి పుట్టాల్సిందే. ఈ రికార్డును ఇప్పటి వరకూ భారత్ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే సొంతం చేసుకున్నారు. వారే భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్ర సింగ్‌ ధోనీ, రాజా మహారాజ్‌ సింగ్‌, విరాగ్‌ మారే.
గిన్నీస్ బుక్ చేరుకునేంత గొప్పదనం వాళ్లలో ఏముందనేది.. తెలుసుకుంటే, ముక్కున వేలేసుకుంటాం.ఎన్నో మ్యాచ్‌ల్లో ధోనీ తన బ్యాట్‌తో సిక్స్‌లు కొట్టి భారత జట్టుకు అపూర్వ విజయాలను అందించాడు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్స్‌. ఏప్రిల్‌ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ సిక్స్‌ కొట్టి భారత్‌కు మధురమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడిన బ్యాట్‌ ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది.
యూకేలో ‘ఈస్ట్‌ మీట్స్‌ వెస్ట్‌' పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధోనీ బ్యాట్‌ను వేలం వేశారు. భారత్‌కు చెందిన ఆర్‌కే గ్లోబల్‌ షేర్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ వారు దాన్ని రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఈ బ్యాట్‌ ఎంత ధర పలికిందంటే 161,295 అమెరికన్‌ డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.72లక్షలు(2011 డాలర్‌ ధర ప్రకారం). ప్రపంచంలో అత్యధిక ధర పలికిన బ్యాట్‌గా ధోనీ వాడిన ఈ బ్యాట్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ ఫౌండేషన్‌ ద్వారా భారత్‌లోని నిరుపేద పిల్లల కోసం ఉపయోగించినట్లు సమాచారం.