Random Video

Mohan Babu Speech At Wife Of Ram Trailer Launch

2018-06-08 1,071 Dailymotion

Mohan Babu speech at Wife Of Ram Trailer launch. Manchu Lakshmi plays lead role in this suspanse thrille

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కొద్దీ సేపటి క్రితమే జరిగింది. ఈ కార్యక్రమంలో వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర యూనిట్ తో పాటు మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. డెబ్యూ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన కుమార్తె మంచు లక్ష్మి, చిత్ర యూనిట్ ని అభినందిస్తూ మోహన్ బాబు ప్రసంగించారు.
సెల్ఫ్ డబ్బా కొట్టడానికి మాట్లాడడంలేదని ఈ చిత్రంలో నటించిన తన కుమార్తెని తప్పకుండా అభినందించాలని మోహన్ బాబు అన్నారు. నా బిడ్డని నమ్మి అమెరికాలో ఉన్న నిర్మాత ఈ చిత్రానికి డబ్బు పెట్టారు, అందుకు తండ్రిగా గర్వపడుతున్నా అని మోహన్ బాబు అన్నారు.
డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. ఏదోవిధంగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటే ఎలా అని మోహన్ బాబు అన్నారు. అది తన బిడ్డలకు నేర్పలేదు అని మోహన్ బాబు తెలిపారు.
తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు విజయ్ కి అభినందనలు తెలియజేశారు. 1975 లో తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా కొత్తే అని మోహన్ బాబు అన్నారు. చెప్పులు లేకుండా నడిచా. ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ స్థాయికి వచ్చా అని మోహన్ బాబు అన్నారు.