Random Video

Janhvi Kapoor Rejects Arjun Reddy Remake Offer

2018-07-02 3,781 Dailymotion

Janhvi Kapoor rejects Arjun Reddy remake offer
అర్జున్‌రెడ్డి రీమేక్‌లో దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటించబోతున్నట్టు బాలీవుడ్ పత్రికలు కోడైకూసాయి. ఈ చిత్రంలో జాహ్నవితో నటింప జేసేందుకు చిత్ర నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరిపారు. అయితే చివరి నిమిషంలో హిందీ అర్జున్ రెడ్డి నుంచి జాహ్నవి తప్పుకోవడం, ఆమె తప్పుకోవడానికి ప్రముఖ దర్శక, నిర్మాత కారణమని ఓ వార్త వినిపించడం వివాదంగా మారింది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే..
తెలుగు ఘన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీలో షాహీద్ కపూర్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జాహ్నవి అయితే బాగుంటుందని నిర్మాతలు అనుకొన్నారు. కానీ ఈ చిత్రంలో ఆమె నో చెప్పడానికి కారణం కరణ్ జోహర్ అని తెలిసింది.
అర్జున్ రెడ్డి లాంటి మసాలా చిత్రంలో జాహ్నవి నటించకుండా కరణ్ జోహర్ అడ్డుకొన్నారు అని బాలీవుడ్ పత్రికల కథనం. కెరీర్ ఆరంభంలో ఉన్నందున అర్జున్‌రెడ్డి లాంటి చిత్రాల్లో కాకుండా ధడక్ లాంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేయమని కరణ్ సూచించడట. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఓ టీవీ నటిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. టివి నటిగా గుర్తింపు పొందిన తార సుతారియా ఈ చిత్రంలో నటించనుండడం విశేషం. తార సుతారియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో అవకాశం దక్కించుకుంది.
అర్జున్‌రెడ్డి రీమేక్‌పై హీరో షాహిద్ కపూర్ స్పందిస్తూ.. ఇది నాకు ఫస్ట్ రీమేక్ చిత్రం. అందుకే కొంత ఎక్సైటింగ్‌గా, కొంత హ్యాపీగా ఉంది. అర్జున్ రెడ్డి సినిమా ఇప్పటికే చూశాను. విజయ్ దేవరకొండ, షాలిని పాండే పాత్రలంటే చాలా ఇష్టం కలిగింది. హిందీలో ఘనవిజయం సాధించేలా మేము కృషి చేస్తాం అని అన్నారు.