Random Video

Koratala Siva And Kiara Advani Face Payment Issues With DVV Danayya

2018-07-16 1,012 Dailymotion

Small Problem between Koratala and DVV Danayya. Kiara Advani and Koratala Siva yet to get payment

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేనుగా సమ్మర్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. మహేష్ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన రెండవ చిత్రం ఇది. భరత్ అనే నేను చిత్రం 90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ కైరా అద్వానీ నటించిన తొలి టాలీవుడ్ చిత్రం భరత్ అనే నేను. దర్శకుడు కొరటాల శివ, కైరా అద్వానీకి పేమెంట్ విషయంలో స్వల్ప వివాదం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.
డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు కొరటాల శివకు ఇంకా పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ సున్నిత మనసున్న వ్యక్తి. ఈ విషయంలో గందరగోళం సృష్టించడం ఆయన ఇష్టం ఉండదని సన్నిహితులు చెబుతున్నారు.
డివివి దానయ్య బడా చిత్రాల నిర్మాత. కొరటాల శివ టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా మారిపోయారు. వీరి కాంబినేషన్ లో మరో చిత్రం వచ్చే అవకాశం ఉందని భావించడంలో తప్పు లేదు. కానీ దానయ్య తీరుతో కొరటాల అసంతృప్తిగా ఉన్నారట. పారితోషకం ఆలస్యం చేస్తుండడంతో ఆయన నిర్మాణంలో మరో చిత్రం చేయడానికి కొరటాల ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి.
కైరా అద్వానీకి భరత్ అనే నేను చిత్రంతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమెకు పారితోషకం విషయంలో చిక్కులు తప్పడం లేదట. కైరా అద్వానీకి కూడా దానయ్య ఇంకా పూర్తి పారితోషకం ఇవ్వలేదని విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది