ప్రస్తుత రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో.. దాన్ని ప్రమోట్ చేసుకోవడం అంతకంటే కష్టం గా మారింది. అన్నిటికంటే బాలీవుడ్లో ప్రమోషన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. వాళ్లు చేసిన సినిమా ఎలా ఉన్నా కూడా ప్రమోషన్ మాత్రం మరో స్థాయిలో చేసుకుంటారు. తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అంటారు.
ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ కూడా అదే చేశాడు. ఈయన నటించిన ‘సింబా’ సినిమా డిసెంబర్ 28న విడుదలైంది. దీనికి మంచి టాక్ వచ్చింది. ఇక ప్రేక్షకులు చూసుకుంటారులే అని వదిలేయలేదు.
ముంబైలోని గెలాక్సీ థియేటర్ దగ్గర డాన్సులు చేశాడు ఈ హీరో. థియేటర్ లాన్‌లో నిలబడి డాన్సులు చేస్తూ.. పాటలు పాడి అభిమానులను అలరించాడు. ఇది కూడా ఓ రకంగా సినిమా ప్రమోషనే. బాలీవుడ్ లో రణ్‌వీర్ సింగ్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. ఇంత క్రేజ్ ఉండి కూడా తన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఇంకా కష్ట పడుతున్నాడు ఈ కుర్రహీరో.
Simmba: Ranveer Singh went all out at a screening of his movie Simmba. He climbed the theatre’s terrace and began dancing to the film’s songs.
#Simmba
#RohitShetty
#ranveersinghdance
#saraalikhan
#deepikapadukone
#temper
#jrntr
#bollywood