Random Video

Lok Sabha Election 2019 : Himachal Pradesh State Profile, Sitting MP, MP Performance Report

2019-03-09 2,847 Dailymotion

Lok Sabha Election 2019:Know detailed information on Himachal Pradesh Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP's, demographics, social picture, performance of current sitting MP's, election results, winner, runner up, & much more on Himachal Pradesh.
#LokSabhaElection2019
#HimachalPradeshloksabhaconstituency
#HimachalPradeshStateProfile
#AnuragSinghThakur
#ShantaKumar
#VirenderKashyap
#BJP

ఫార్మా కంపెనీలకు స్వర్గధామం.. పర్యాటకానికి కేంద్రబిందువు..హిమాలయాల ఒడిలోని చల్లని ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ ప్రశాంతతకు మారుపేరు. పార్లమెంటు ఎన్నికల సెగతో హిమాచల్ వేడెక్కుతుండగా ఇక్కడి రాజకీయాలు బీజేపీ, కాంగ్రెస్ కు పలు సవాళ్లు విసురుతున్నాయి. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ లను సరిహద్దులుగా ఉన్న హిమాచలీలు శాంతికాముకులు. బౌద్ధక్షేత్రాలతో అలరారే ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ. కులు, మనాలి, డల్హౌసీ వంటి సమ్మర్ డెస్టినేషన్స్ ఉన్న ఈ రాష్ట్రానికి టూరిస్టులు ఎక్కువగా వస్తారు. సుమారు 69 లక్షల జనాభాతో ఉన్న హిమాచల్ రాష్ట్రంలో.. 90శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో 25శాతం ఎస్సీలు, 4శాతం ఎస్టీలు ఇక్కడ నివాసముంటున్నారు. వేసవిలో సిమ్లా రాజధానిగా ఉండగా.. శీతాకాలంలో మాత్రం ధర్మశాల హిమాచల్ రాష్ట్రానికి రాజధానిగా ఉంది. గోల్ఫ్, పారాగ్లైడింగ్, స్కీయింగ్, స్కేటింగ్ క్రీడలకు ఈ రాష్ట్రం అనువుగా ఉంది.