Random Video

Lok Sabha Elections2019 : Jharkhand State Profile,Sitting MP's,MP's Performance Report

2019-03-09 6,426 Dailymotion

Lok Sabha Election 2019:Know detailed information on Jharkhand Lok Sabha Constituencys in video. Get information about election equations, sitting MPs, demographics, social picture, performance of current sitting MPs, election results, winner, runner up, & much more on Jharkhand.
#LokSabhaElections2019
#Jharkhandloksabhaconstituencys
#JharkhandStateProfile
#NishikantDubey
#JayantSinha
#RamTahalChoudhary
#INC
#JMM
#BJP

మారుమూల అటవీ ప్రాంతాలతో..ఖనిజ సంపదతో తులతూగే ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజకీయ సంక్షోభాలు బాగా అలవాటు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎంల మధ్యనే ఇక్కడ అధికారం చేతులు మారుతుంటుంది. బిహార్ నుంచి 2000 సంవత్సరంలో విడిపడిన ఝార్ఖండ్ లో బొగ్గుగనుల నిక్షేపాలు చాలా ఎక్కువ. ఓవైపు బిహార్, మరోవైపు ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలను సరిహద్దులుగా ఉన్న ఝార్ఖండ్ జనాభా 3.3 కోట్ల పైమాటే. 76శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తుండగా..11శాతం మంది ఎస్సీలు 14శాతం మంది ఎస్టీలున్నారు. ఆదివాసిల సంస్కృతికి రాజధానిగా ఉన్న ఝార్ఖండ్ లో గత పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లకు గాను 12 సీట్లు బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 2 సీట్లలో ఝార్ఖంఢ్ ముక్తి మోర్చా..అంటే జేఎంఎం అనే ప్రాంతీయ పార్టీ దక్కించుకుంది. గత లోక్ సభ ఎన్నికలు ఇక్కడ బీజేపీకి నల్లేరు మీద నడకలా సాగాయి.. మోడీ హవాతో కమలం వికసించింది.