Random Video

Hyderabad డ్రగ్స్ దందా: భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్..., భూమిని తవ్వి మరీ !

2020-08-20 805 Dailymotion


#Hyderabad
#DirectorofRevenueIntelligence
#underground
#DRI
#mumbai
# డ్రగ్స్

నగరంలో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. హైదరాబాద్ నగర శివారు జిన్నారంలోని ఓ ఫార్మా కంపెనీ ఆవరణలో భారీగా మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ఐదు రోజులుగా డీఆర్ఐ అధికారులు ఆ కంపెనీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు. సోదాలు చేసినా దొరక్కుండా ఉండేందుకు డ్రగ్స్‌ను భూమిలో పాతిపెట్టినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్నవారి నుంచి సేకరించిన సమాచారంతో మంగళవారం రాత్రి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని తవ్వి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను వెలికితీశారు. వెలికితీసిన మాదకద్రవ్యాల్లో ఎపిడ్రిన్ 45 కిలోలు, మెఫిడ్రోన్ 7.5 కిలోలు ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు