KTR Speech on Unemployed Problems : ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం రేవంత్రెడ్డి, అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న తరుణంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవసరమైతే వాయిదా తీర్మానంతో అసెంబ్లీను స్తంభింపజేసేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేదాకా వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.