Minister Lokesh Helpful For Telugu Worker Shiva Reached AP: మంత్రి నారా లోకేశ్ చొరవతో కువైట్ నుంచి తెలుగు కార్మికుడు శివ స్వస్థలానికి చేరుకున్నాడు. కువైట్‌లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్స్‌లో పెట్టిన వీడియోపై ఇటీవల లోకేశ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడ్ని ఏపీకి తీసుకొచ్చే వరకు వ్యవహారాన్ని మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. శివ స్వస్థలం మదనపల్లి చేరుకోవడం పట్ల లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.