Random Video

తెలంగాణ అసెంబ్లీలో రేపు జాబ్​ క్యాలెండర్​ ప్రకటన

2024-08-01 99 Dailymotion

Telangana Job Calendar Release Tomorrow in Assembly : శుక్రవారం(రేపు) అసెంబ్లీలో జాబ్​ క్యాలెండర్​ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డి వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్​ క్యాలెండర్​ విడుదల చేస్తామన్నారు. అలాగే త్వరలో ప్రజలకు తెల్ల రేషన్​ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. పేదలకు తెల్లరేషన్​ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని చెప్పారు. రేషన్​ కార్డుల జారీ విధివిధానాల కోసం కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని మంత్రివర్గ నిర్ణయాలను ప్రెస్​మీట్​ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు.