MLC Jeevan Reddy On Hydra : పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఎక్కడ అక్రమ కట్టడాలు కూల్చొద్దని చెప్పలేదన్న ఆయన అక్రమ నిర్మాణాల కూల్చివేతలో నిబంధనలు పాటించాలని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివరించారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామన్న ఆయన అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రతి ప్రభుత్వం చేసేదేనని వెల్లడించారు.