Success Story Of Organic Farmer Venkataswamy : జీవితంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కటిక దరిద్రుడైనా పట్టుదలతో పనిచేస్తే కోటీశ్వరుడు కావచ్చు. ఎంత డబ్బున్న వారైనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే దరిద్రుడిగా మారవచ్చు. ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ కోటికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి 30 ఏళ్ల కిందట ఓ నిరుపేద. యజమాని ఎగతాళిని ప్రేరణగా తీసుకొని ఇప్పుడాయన కోటీశ్వరుడిగా మారాడు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ మట్టిని ముడితే బంగారం అవుతుందని నిరూపించారు.