IMD Issues Rain Alert To Telangana : గత కొన్ని రోజులుగా ఎండల కారణంగా అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. రాగల 4 రోజులపాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలను జారీచేసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.