Collector Inspected MGNREGS Works : ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని పేరొందిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉపాధి కూలీల సమస్యలను తెలుసుకునేందుకు వారి కోసం ఏకంగా గుట్టే ఎక్కాడు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం చిట్యాలబోరినిని కలెక్టర్ సందర్శించారు. ఆనంతరం ఉపాధి కూలీలు అటవీ ప్రాంతంలో పని చేస్తున్నారని తెలిసి, కచ్చా రోడ్డు మార్గంలో రెండు కిల్లోమీటర్ల వరకు బైక్పై ప్రయాణించారు. ఆ తర్వాత ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడం కోసం గుట్ట ఎక్కి ఉపాధి కూలీల వద్దకు చేరుకున్నారు.